కుల వైషమ్యాలను రెచ్చగొట్టిన వారి పై చర్యలు తప్పవు.. జంపాన కొండలరావు హెచ్చరిక..!
సోషల్ మీడియాలో కుల వైషమ్యాలు రెచ్చగొడుతూ పెనమలూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారిపై సాగిస్తున్న విషప్రచారాలను ఉయ్యూరు పట్టణ వై.యస్.ఆర్ సిపి అధ్యక్షులు శ్రీ జంపాన కొండలరావు గారు తీవ్రంగా ఖండించారు..
వై.యస్.ఆర్ తాడిగడప మున్సిపాలిటీ లో యస్.సి సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ డా|| ఆర్. రవీంద్ర భాస్, గౌడ సామాజిక వర్గానికి చెందిన పోసిన చెంచు రామారావు ల మధ్య ఏర్పడిన సివిల్ వివాదాన్ని రాజకీయ దురుద్దేశంతో పార్థ సారథి గారికి ఆపాదిస్తూ.. సోషల్ మీడియా వేదికగా కుల విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారాని తెలిపారు.
ఈ ప్రచారం లోని నిజానిజాలు తెలుసుకునేందుకై తన తో సహా అనేక మంది గౌడ సంఘం నాయకులు, పెద్దలు కానూరు లోని రీ సర్వే నెం: 96/5 నందు గల సదరు వివాదాస్పద భూమి వద్దకు వెళ్ళి.. అక్కడ డాక్యుమెంట్స్, వివిధ ధృవ పత్రాలు పరిశీలించగా.. సోషల్ మీడియా లో సాగుతున్న ప్రచారమంతా వట్టి కట్టు కథ అని తెలుసుకున్నామన్నారు.
పార్థ సారథి గారు 2002 లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుండి నేటి వరకు వారిని అత్యంత దగ్గర గా పరిశీలించిన కొండలరావు గారు, తన అనుభవంలో పార్థ సారథి గారు వాస్తవాల ప్రాతిపదికిన కాకుండా కుల కోణంలో సమస్యను పరిశీలించి యుండలేదని ఘంటా పదంగా చెప్పగలనన్నారు.
ప్రజలు వారి సమస్యల పరిష్కారాన్ని కై ప్రజా ప్రతినిధులను ఆశ్రయించడం సర్వ సాధారణమని.. వివిధ కులాలు, మతాలకు చెందిన లక్షలాది మంది ప్రజల ఆమోదంతో ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్న ఒక ప్రజా నేత కు దురుద్దేశాలు ఆపాదిస్తూ... ఆయన పై అసత్య ఆరోపణలు చేయడం అత్యంత గర్హనీయమని.. కులం ముసుగులో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డా|| వై.యస్.ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ జంపాన కొండలరావు గారు తెలియజేశారు.